
యువత మనసులో “వెన్నెల”కాయిస్తు ఏందబ్బాయా… అంటూ యువత గుండెల్లో “యమదొంగ”గా చొరబడిదాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినీ అభిమానులను చూరగొన్న అమెరికా అందాల తార పార్వతీ మెల్టన్ తెరకు దూరమై చాలా కాలమైంది.
ఆమె చీర కట్టినా, చిత్రమైన బట్టలు వేసినా వెండితెర యూత్ అంతులేని “జల్సా” చేస్తుందనడంలో సందేహం లేదు. “యమహో యమహా” అంటూ “అల్లరే అల్లరి” చేసి “దూకుడు”గా యువ ప్రేక్షకుల్ని ఒక “గేమ్” ఆడుకొన్న మెల్టన్ ఎందుకో తెరపైకి రావడం లేదు. అయినా, ఆమె నటించిన సినిమా మల్టీ ప్లెక్స్ లో రాకపోయినా ఏదైనా ఓటిటిలో కనిపిస్తే చాలు అభిమానులు ఇట్టే అతుక్కుపోతున్నారు.