“ఆధిత్య”అక్కడి వరకే…

isro aditya
l 1

భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట లంచ్ పాడ్ నుంచి సూర్యుని వైపు సంధించే ఆదిత్య-ఎల్ 1 శాటిలైట్ సూర్యుడిపై దిగేందుకు కాదని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఆదిత్య ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటూ అక్పకడి నుంచి పరిశోధనలు సాగిస్తుందని వివరించింది.ఆదిత్య వెళ్ళేది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% వరకు మాత్రమే అని తెలిపింది. సూర్యుడు భారీ వాయుగోళం అనీ, దాని బాహ్య వాతావరణాన్ని ఆదిత్య అధ్యయనం చేస్తుందని పేర్కొంది. ఈ శాటిలైట్ సూర్యుడి దగ్గరకు కూడా వెళ్లదని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *