అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఈ విషయం గుప్పుమనడం శ్రీవారి భక్తులు భయందోలనకు గురిచేస్తోంది. కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అటవీ శాఖ ఐదో దానిపై దృష్టి పెట్టింది. దాన్ని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాలలో బోనులు ఏర్పాట్లు చేశారు. మెట్ల దారిలో చిరుత ఆనవాళ్ళు కనిపించడంతో కాలినడక భక్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.