ఐదు రాష్ట్రాలకు మోగింది…!

cec c

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణా సహా ఛత్తీస్ ఘర్,  మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు.

ts f

తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు. నామినేషన్లను 10వ తేదీ నాటికీ దాఖలు చేయాలి. 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వ తేది లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

miz f

మిజోరంలో ఈ నెల 13 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. 20 తేదీ వరకు నామినేషన్ లను దాఖలు చేయాలి. 21నామినేషన్ ల పరిశీలన ఉంటుంది.23వ తేదీ లోపు ఉపసంహరించుకోవచ్చు. 7 వ తేదీన 40 శాసన స్థానాలకు పోలింగ్ ఉంటుదని అధికారులు తెలిపారు.

raj f

అదేవిధంగా రాజస్తాన్ లో ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 6 వ తేదీ వరకు నామినేషన్ లు దాఖలు చేసుకోవాలి. 7 వ తేదీ న పరిశీలన ఉంటుంది. 9వ తేదీ లోపు నామినేషన్ లను ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 23వ తేదీన 200 శాసన సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

mp f

మధ్య ప్రదేశ్ లో ఈ నెల 21న ప్రకటన జారీ అవుతుంది. 30వ తేదీ వరకు నామినేషన్ లు దాఖలు చేయవచ్చు. 31వ తేదిన నామినేషన్ ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 2వ తేదీ లోపు నామినేషన్ లను ఉపసంహరించుకోవచ్చు. మొత్తం 23౦ శాసన సభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ ఉంటుంది.

chat f

ఇక ఛత్తీస్ ఘడ్ కి సంబంధించి రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. మొదటి విడతకు ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ ఇస్తారు. 20వ తేదీ వరకు నామినేషన్ లను దాఖలు చేయవచ్చు. 21న వాటి పరిశీలన ఉంటుంది. 23 తేదీ లోపు నామినేషన్ లను ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 7వ తేదిన 20 శాసనసభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా మరో 70 స్థానాలకు ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ అవుతుంది. 30వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 31వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 2వ తేదీ వరకు వాటిని ఉపసంహరించుకోవచ్చు.  నవంబర్ 17న తుది విడత పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 3వ తేదిన వెల్లడిస్తారు.

ఎన్నిక ప్రక్రియను ప్రారంభించడానికి 40 రోజుల కసరత్తులో 5 రాష్ట్రాల్లో పర్యటించినట్టు,  ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యే అన్ని విభాగాలను సంప్రదించినట్టు, రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా కలిసి వారి నుంచి సమాచారం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగుతాయని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని అసెంబ్లీ నియోజక వర్గాలతో పోల్చితే  1/6వ వంతు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని, అదేవిధంగా ఓటర్ల సంఖ్య ప్రకారం చూసినా 1/6 వ వంతు జనాభా ఈ రాష్ట్రాల్లో ఉన్నారని కమిషనర్లు వివరించారు. ఈ రాష్ట్రాల్లో  మొత్తం 60.20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *