భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్ డెమో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 టి.వి.- డి1 రాకెట్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ లో క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి పంపారు.
ఈ ప్రయోగంలో రాకెట్ తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళిన తర్వాత విడిచి పెట్టింది. దీంతో క్రూ మాడ్యూల్ ప్యారాచూట్ సాయంతో షార్‌కి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో దిగింది. అప్పటికే బంగాళాఖాతంలో సిద్దంగా ఉన్న నౌకా దళ సిబ్బంది క్రూ మాడ్యూల్‌ని స్వాధీనం చేసుకొని, ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇదంతా 8 నిమిషాల్లో పూర్తీ కావడం విశేషం. గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించిన పరీక్షల్లో ఇదో కీలకమైన అంశమని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. గగన్ యాన్ యాత్రలో ఏవైనా సమస్యలు తలెత్తితే అందులోని క్రూ (సిబ్బంది) సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత సంస్థ పై ఉందన్నారు. అందుకు ఇలాంటి డెమో ప్రయోగాలు అవసరం అని వివరించారు.
“క్రూ” సేవ్ టెస్ట్ సక్సెస్…
