“ఖాకీ” అంటే త్యాగనిరతి…

jagana police c

పోలీసులు వేసుకునే ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యం అనీ, పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదనీ, సమాజంలో అతను ఒక బాధ్యత గల వ్యక్తీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.

police jagan
నివాళి..

నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. జన రక్షణ కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. 1959 అక్టోబరు 21 న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్‌ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. గత ఏడాది  దేశ వ్యాప్తంగా అమరులైన 188 పోలీసులుకు జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. టెక్నాలజీ వల్ల మార్పులకు అనుగుణంగా సైబర్‌ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు, సైబర్‌ వేదింపుల వరకు ప్రతి అంశంలోనూ నేరాలన్నీ నిరోధించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి శిక్షవేయడానికి పోలీసులు ఎంతగానోనైపుణ్యం సాధించాల్సిన అవసంగ్ ఉందని పేర్కొనారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వాడకం వల్ల సైబర్‌ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తున్నవాళ్లను ఎదుర్కొవాల్సిన ఒక బృహత్తర బాధ్యత కూడా ఇవాళ పోలీసుల భుజస్కంధాల పై ఉందన్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ మారుతున్న ఈ సమాజం విసురుతూ ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనందరి సిద్ధం కావాలని కోరారు. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోనూ మన పోలీసులు అత్యాధునిక సైబర్‌ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారని తెలిపారు. ఇదే సమయంలో అసాంఘిక శక్తులనే పదాన్ని మార్చాలని, ఇటీవల జరిగిన అనేక సంఘటనలు చూసినప్పుడు మనందరికి కూడా ఇది  ప్రస్ఫుటంగా కనిపిస్తుందని జగన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా అంగళ్ళ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడం, ఆ తర్వాత పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర కావడం, చివరకి ఒక పోలీసు కన్ను పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి సంఘటనలకు బాధ్యులైన వారికి సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు.

dgp andhra
డిజీపి రాజేంద్రనాద్ రెడ్డి

నాలుగేళ్ళలో  దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో 16వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో ప్రభుత్వం నియమించిందన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లాలో దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం దేశం లోనే తొలిసారి అన్నారు. ఒక్క దిశ యాప్‌ మన రాష్ట్రంలో 1.25 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో రిజిస్టర్‌ కావడం సంతోషకరమని జగన్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి, ప్రతి చెల్లెమ్మకూ, అక్కకూ ఒక విషయం గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అన్నది ప్రభుత్వ విధానం అనీ, శాంతి, భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఆడపిల్లలు, మహిళలు విషయంలోనూ, మరీ ముఖ్యంగా పిల్లలు, అణగారిన సామాజికవర్గాల భద్రత విషయంలో ఎలాంటి రాజీపదేది లేదని స్పష్టం చేశారు. సమాజం కోసం విధి నిర్వహణ చేస్తున్న మీ అందిరికీ, మీ కుటుంబాలకు, ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని జగన్ అకంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *