ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో లో జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు 100 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత్ బౌలర్లు విజృంభించడంతో 129 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ప్లేయర్లలో లివింగ్ స్టోన్ (27) చేసిన పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో షమీ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.