నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణాలు... - EAGLE NEWS

నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణాలు…

vja bus c

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఈ బస్సు ప్రమాదం పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సంఘటన జరగడం దురదృష్ట కరమని, 24 గంటల్లో విచారణ పూర్తిచేసి కారణం తెలుసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయనల చొప్పున పరిహారం, గాయపడిన వారికి ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఇదిలా ఉంటే,విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని, నాలుగున్నరేళ్లుగా ఆర్టీసి గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదన్నారు. నియామకాలు కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర వత్తిడికి గురవుతున్నారని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు,  క్షతగాత్రులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

2 thoughts on “నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *