కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా. నిండు మనస్సుతో మీ బిడ్డను ఆశీర్వదించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి.’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. ఈరోజు వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్ సింగ్ లతో కలిసి బండి సంజయ్ కరీంనగర్ కలెక్టరేట్ లోకి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధిగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం వేల కోట్లు ఇస్తున్నా ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దారి మళ్లించారు. పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా పేదలకు ఇవ్వలేదు. ఒకటి రెండు స్కీంలను అమలు చేసి అదేదో గొప్ప పనులు చేసినట్లుగా భూతద్దంలో చూపుతున్నరని వ్యాఖ్జ్యనించారు.. కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? కమీషన్లు ముట్టజెబితే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదని, ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి శాంతిభద్రతలకు తూట్లు పొడుస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రశాంత వాతావరణ ఉండాలన్నా, అభివ్రుద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, అవినీతికి తావులేని పాలన కావాలన్నా బీజేపీని గెలిపించాలని కోరారు.
సందడిగా “సంజయ్” నామినేషన్..
