“ఓటు” కోసం “నోటు”నై వస్తున్నా…..!

money 5

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కట్టల కొద్ది డబ్బు చేతులు మారుతున్నాట్టు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ఆయా నియోజక వర్గాలకు కోట్ల రూపాయలు తరలిపోతున్నట్టు సమాచారం అందుతోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు, కేంద్ర బలగాల సమక్షంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ నగదు ప్రవాహం మాత్రం ఆగడం లేదని ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో తనిఖీల తంతును ఎప్పటికప్ల్పుడు పరిశీలించే హవాల ఏజంట్లు “పైలెట్ వాహనాలు” ఏర్పాటు చేసుకొని కోట్లాది రూపాయలను సునాయాసంగా చేర వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ప్రక్రియ మొదలైన తొలి రోజే హైదరాబాద్ చుట్టు పక్కల కోట్ల రూపాయల డబ్బు పట్టుపడింది. ఆ తర్వాత  వివిధ ప్రాంతాల్లో ఉహించించని విధంగా నగదు పట్టుపడుతోంది. బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. మొదట్లో బెంగుళూరు నుంచి 50 కోట్ల రూపాయలు తరలించే ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. అయితే, అప్పటికే ఈ మొత్తంలో తెలంగాణకు 8 కోట్లు తరలిపోయినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. తెలంగాణకు నగదు తరలిస్తున్నారనే విశ్వశనీయ సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు.మొత్తం 22 బాక్సుల్లో నగదును పెట్టి లారీలో తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో  పోలీసులు తనిఖీ చేయగా ఓ కారులోని  రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల నగదు లభించింది. అదే రోజు బిక్కనురులో జరిపిన తనిఖీలలో పెద్ద ఎత్తున మద్యం బాక్సులు దొరికాయి.ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ లో 26౦ కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారిక సమాచారం.

liqr
పట్టుపడ్డ మద్యం

ఇదిలా ఉంటే పక్కా సమాచారం ఉన్న వాహనాలు మాత్రమే తనిఖీలలో పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఆయా రహదారుల్లో నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగించాడ వాళ్ళ చెక్ పోస్టుల వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం సిబ్బందికి తలకు మించిన భారగానే ఉందని కొందరు అధికారులే వెల్లడించడం గమనార్హం. వివిధ జిల్లాలకు ప్రధాన రహదారుల నుంచి అనేక స్థానిక రహదారులు సంధానం అయి ఉండడం కూడా డబ్బు, ఉచితాలు తరసించేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఇలాంటి దారుల్లోనే కోట్ల రుపాయల నగదు, ఉచితాలు తరలిపోయినట్టు తెలుస్తోంది. ఈ తంతు చివరి మూడు రోజులు ముమ్మరంగా సాగే అవకాశం ఇందని పరిశీలకుల అభిప్రాయం. అంతేకాక, ఎక్కడికక్కడ అనేక మంది నేతలు స్థానిక బడా వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆటోలు, ద్విచక్రవాహనాలలో నగదు రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *