బిఆర్ఎస్ గద్దె దిగడం ఖాయం…

modi kamrdy

వచ్చే నెల 3వ తేదీన తెలంగాణలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గద్దె దించుతారనే నమ్మకం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నోఆశలు కన్పిస్తున్నాయని వాటిని నెరవేర్చుకోవడానికి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గాలి వస్తుందన్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. దేశంలో  7 దశబ్దాలు పాలించిన  కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎమి చేయాలేదని అదేవిధంగా పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వమూ ప్రజలకు ఏమీ చేయలోదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల ఆకాంక్షను ప్రతిబింబించేల బిజెపి పార్టీ మెనిపేస్టో ఉందని, బిజెపి పార్టీ ప్రజలకు చెప్పింది మాత్రమే చేస్తుందని, రామామందిర నిర్మాణం చెప్పట్టి తీరినట్టు తెలిపారు. ఆదివాసిల కోసం సెంటర్ యునివర్సిటీని నిర్మించినట్టు, తెలంగాణలో బిసి సమాజానికి బిజెపి పార్టీ మద్దతు పలుకుతుందని, బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలంగాణ లో ముఖ్యమంత్రిని చేస్తామని మోడీ మరోసారి చెప్పారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు బిసిలకి ఎమి చేయాలేదన్నారు.

modi kamrdy in

తెలంగాణలో దళిత నేతను తోలి ముఖ్యమంత్రి చేస్తానాని చెప్పి కేసిఆర్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు,  తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగల అభివృద్ధి కి తీవ్ర అన్యాయం జరిగిందని, మాదిగలకి న్యాయం చేయాలని కొత్త కమిటీని వేసినట్టు మోడీ తెలిపారు. తెలంగాణ రైతులని బిఆర్ఎస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని, రైతుల సంక్షేమమే బిజెపి పార్టీ లక్ష్యమని, అందుకే  4వందల కోట్ల రుపాయలతో పిఎం కిసాన్ ద్వారా రైతులు లబ్ది పోందుతున్నారని చెప్పారు.  గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం లక్ష ముప్పై వేల టన్నులకి పైగ వరిని కోనుగొలు చేసిందని,  బిజెపి ప్రభుత్వం రైతులకి అదనపు లాభం చేకూర్చేలా  ప్రయత్నం చేసిందన్నారు.  తెలంగాణ ఓక యువ రాష్ట్రం అని  యువతకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, టిఎస్పిఎస్సి పరీక్షలతో యువతని ప్రభుత్వం ఎలా మోసం చేసిందో తేలిపోయిందని ప్రధాని విరుసుకుపడ్డారు. మోడి గ్యారెంటి అంటే గ్యారెంటి పూర్తి చేస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ౩౦వ తేదీన జరిగే పోలింగ్ లో బిజిపి అభ్యర్ధులకు ఒతువేయాలని మోడీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *