“అటా” సేవలు…

ata 23 scaled

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు పలురకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు “ఆటా” వేడుకల ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా సంస్థ 1991లో స్థాపించి 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్ కు పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో 15 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది  జూన్ 7,8,9 తేదీలలో అమెరికా లోని అట్లాంటా నగరంలో జరగనున్న ఆటా సదస్సుకు తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరు అవుతారని, ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆటా నుంచి వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, మీడియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు సిహెచ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *