పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకి తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కోల్‌కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ తెలిపారు. ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రమోటర్‌ను అరెస్టు చేసినట్లు మేయర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.