'కులం' తర్వాతే "పంచాయతీ" - EAGLE NEWS

‘కులం’ తర్వాతే “పంచాయతీ”

IMG 20240516 WA0004

రాష్ర్టంలో కుల గణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్పి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కుల గణన చేపట్టి, కులాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

IMG 20240514 WA0009

బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల ముందు రేవంత్ అన్నారని, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ అదే అంటున్నారని కాసాని గుర్తు చేశారు.సహజ న్యాయమే సమాజ న్యాయం కావాలని, ప్రజాస్వామ్య పాలనలో కూడా ప్రజలను పాలకులు మోసం చేసి గద్దెను ఎక్కుతున్నారని కాసాని పేర్కొన్నారు. వెంటనే కుల గణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల వాటా బీసిలకు ఇవ్వాలని కాసాని శ్రీనివాసరావు గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, హైదరాబాద్ ఇంఛార్జి గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

2 thoughts on “‘కులం’ తర్వాతే “పంచాయతీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *