క్షమాభిక్ష..

jail 15

వచ్చే ఆగస్టు 15న తెలంగాణ జైళ్ళలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల కానున్నారు. దీనికి హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇరువురి మధ్య భేటీ సాగింది. ఈ సందర్భంగా గవర్నర్‌తో సీఎం లంచ్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ లపై చర్చ, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఆగస్టు 15న ఖైదీల విడుదల, రాష్ట్ర విభజన అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్ ఖైదీలకు క్షమాభిక్ష కల్పించడం, శిక్షల నుంచి ఉపశమనం కల్పించే అధికారం ఉన్నది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *