జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్ జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్ ను జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నియమించారు. ముంబైలో ఉండే ఆంథోనీకి శుక్రవారం కేఎస్ఆర్ గౌడ ఆన్ లైన్ లో నియామక పత్రాలు పంపించారు. ఉన్నత విద్యావంతుడైన ఆంథోనీ గతంలో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ గా 2010 వరకు పని చేశారు. తరువాత ఎస్ఆర్పీఎఫ్ శిక్షణ పొందిన ఆయన హ్యాండ్ టూ హ్యాండ్ కమాండో గా 2019 వరకు పని చేశారు. సీ కాడెట్ కార్ప్ గా, ఎన్.సి.సి. తదితర వాటిని అభ్యసించే సమయంలో పోలాండ్, ఇటలీ, నేపాల్ వంటి దేశాల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్ అయిన స్వార్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా(జర్మనీ) కమాండర్ గా పని చేస్తున్నారు.
అలాగే టేప్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా, సౌత్ ఆసియన్ క్రిస్టియన్ కరాటే ఫెడరేషన్ అధ్యక్షుడుగా, యూనివర్సల్ పీస్ ఆర్గనైజేషన్ అంబాసిడర్ గా, జుజిట్సు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా, స్పోర్ట్స్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆంథోని ఏడు సార్లు ఇంటర్నేషనల్ కరాటే, జుజిట్సు ఛాంపియన్ గా నిలిచారు. జపాన్ , కెనడా, లుథివేనియా, పోలాండ్, హంగేరి, జర్మనీ, ఇటలీ, గ్రీస్, జూరిచ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, మారిషస్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేషియా, నేపాల్, తదితర దేశాల్లో జరిగిన అనేక క్రీడలు, కరాటే టోర్నమెంట్ లలో ఆయన పాల్గొన్నారు. అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆంథోనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేయాలని జై స్వరాజ్ పార్టీలో చేరినట్టు కాసాని తెలిపారు.