అమెజాన్ అడవుల్లో..

Screenshot 20240719 151505 WhatsApp

అనేక వందల ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే ఓ అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్ అడవుల్లో సంచరిస్తున్న “మాష్కో పైరో” అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను “సర్వైవల్ ఇంటర్నేషనల్ “అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరూ సమీపం లోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఆహారం కోసం ఈ తెగ వాసులు జనసంచారంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ ప్రాంతంలో మాష్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు.ఇదిలా ఉంటే ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫల మవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగ వారు బయటకు రావడంతో స్థానికులకు, వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *