మిస్ యూనివర్స్ ఇండియాకు ఆంద్రప్రదేశ్ నుంచి అర్హత సాధించిన చందన జయరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకోవాలని ఆకాంక్షించారు.