ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగ రాయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ ల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం అధికారుల్లో నైతికత దెబ్బతిన్నదని అన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిన వారు కేంద్రంలో, ఆర్‌బీఐలో చాలా కీలకం అయ్యారని, ప్రపంచ బ్యాంకులో కూడా పనిచేశారని చంద్రబాబు చెప్పారు. చిన్న తప్పు జరిగితే దాన్ని సరి చేయావచ్చు కానీ, విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో శ్రమ పడాలన్నారు.
తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పడు కరెంటు లేని గ్రామాలు ఉన్నాయని, ఇప్పుడు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేశాయన్నారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాక కాంపిటేటివ్ ఎకానిమీగా పోటీ పడ్డామని.. 2029కి మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా పనిచేస్తే 2047 నాటికి మొదటి స్ధానంలోకి వెళుతామని పేర్కొన్నారు. మనం గణితంలో ఎంతో ముందున్నామని, బ్రిటిష్ వారు ఇంగ్లీష్‌ను వదిలి పెట్టిపోయారని, ఈ రెండు ఐటికి డెడ్లీ కాంబినేషన్ దాన్ని అందిపుచ్చుకున్నామన్నారు.1995 హైదరాబాద్‌లో బెస్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగా దాన్ని తరువాత వచ్చిన వారు కొనసాగించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ పెర్ కెపిటా ఇన్ కం సాధించిన వారు ఇండియన్స్ అని, అందులో 30 శాతం తెలుగువారు ఉన్నారన్నారు. ఈ అయిదేళ్లలో ఎన్నివిధాల ఇబ్బందులు పడ్డామో అన్ని విధాలా భాదింపబడ్డామన్నారు. ఎన్నికల్లో పునర్‌నిర్మాణం చేస్తామని పవన్ కళ్యాణ్, తాను హమీ ఇచ్చామని, ఇంకా ఎన్నో సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ రాష్ట్రం దశ దిశను సూచించేదిగా ఈ కలెక్టర్ కాన్పరెన్స్ ఉంటుందన్నారు. ప్రజా వేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్లమని, వేరే ప్రదేశంలో నిర్వహించడం ఇష్టం లేక ఇక్కడే పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్కసారి కూడా కలెక్టర్ కాన్ఫురెన్స్ పెట్టలేదంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు.