“బ్లడ్” బీచ్…

Screenshot 20250316 214354 WhatsApp

ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో కురిసిన వర్షం రక్తంలా మారింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతోంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా పారుతున్న వరద నీటిలో గంతులు వేశారు.

సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ చాలా అధిక మోతాదులో ఉంటుందని, వర్షపు నీరు రక్త వర్ణంలోకి మారడానికి కారణం ఇదేనని వివరణ ఇచ్చారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రెయిన్ బో ఐలాండ్ కు వస్తుంటారని పర్యాటక శాఖ అధికారులు వివరించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *