IMG 20240803 WA0009

బాబుని కలిసిన చందన..

మిస్ యూనివర్స్ ఇండియాకు ఆంద్రప్రదేశ్ నుంచి అర్హత సాధించిన చందన జయరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు….

Read More
babu mark c

ఎవరి “మార్కు” పాలన..!

ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కొత్త ప్రభుత్వ పాలన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు  పరిపాలన ఆలోచనలు, రూపొందించే వ్యూహాలు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తాయనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. నెల రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న ఆరాటం ప్రతీ ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అమరావతి అభివృద్ది, విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారం, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, రైతు సమస్యల పై…

Read More
babu revnt 6

దశాబ్దం కాలంలో తొలి అడుగు…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు నడిశాయి. గత  పదేళ్లలో ఏ వివాదాలూ లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో…

Read More
ramojir c

అకాడమీకి “రామోజీ” పేరెందుకు..!

రామోజీ రావు ఒక పత్రికకు అధిపతి. “ఈనాడు” పేరుతో ఆయన చేసింది సమాజ సేవ కాదు, అది ఒక వ్యాపారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పాఠకులకు, దేశ, విదేశాల్లో  అందరికీ తెలిసిన వ్యవహారమే. ఉమ్మడి “తెలుగుదేశం”లో నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పత్రికలు వచ్చాయనేది బహిరంగ రహస్యమే. తెలుగు రాష్ట్రాల్లో “ఈనాడు” వెలుగు, జిలుగులకు ఒక్క రామోజీ ఆలోచనలే కారణం అన్నట్టు ఆయన మరణానంతరం  విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కానీ,”ఈనాడు” శీర్షికలు, వ్యాసాలు, సంపాదకీయాలు తదితరాల వెనుక…

Read More
modi babu first day

ప్రమాణానికి …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి హాజరవుతున్నారు. మోడీ పర్యటనకు సంబంధించి కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నిరబ్ మాట్లాడుతూ రేపు కేసరపల్లి ఐ.టి. పార్కు ప్రాంగణంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 12 ఉదయం 8.20 గంటలకు మోడి ఢిల్లీ…

Read More
IMG 20240421 WA0005

కక్షల పాలన…

సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన ఆమె వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన హైదరాబాద్ ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబునాయుడు అని, ఎల్లప్పుడూ…

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
24 c

24 అంటే 40-జనసేన “సినిమా” లెక్కలు…!

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉత్కంఠకు తెరపడింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడున్న మొత్తం 175 నియోజక వర్గాలలో జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుంది. అదేవిధంగా మూడు లోక్ సబ్ నియోజక వర్గాలలో “సేన” అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. అయితే, ఇక్కడే “సైనికుల్లో” నిరాశ తలెత్తింది. అధికారమే లక్ష్యంగా, మార్పే…

Read More
shrmil babu

“నాన్న, బాబు” జీపులో…

తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి అనేక  మంది రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని,ఇందులో భాగంగానే చంద్రబాబు కుటుంబాన్నికూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్టు షర్మిల చెప్పారు. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానాన్ని అందజేసి కుటుంబ సమేతంగా  తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కొద్దిసేపు చర్చలు జరిపినట్టు అందులో  అధిక సమయం…

Read More
babu shrmil

బాబు గారూ రావ్వాలి..

హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చం వైఎస్ షర్మిల గాఆహ్వానించారు. అయన నివాసంలో వ్యక్తిగతంగా కలిసి షర్మిల బాబుకి పెళ్లి పత్రిక అందజేశారు.

Read More
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read More
yuvac

మళ్లీ జన”గళం’….!

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్…

Read More
jagan babu.jpg c

అటు“బెయిల్”బలం – ఇటు అసహనం…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు కావడం అక్కడి ప్రధాన ప్రత్యర్ధి వైసిపి నేతలకు మింగుడు పడడం లేదా? బాబు అరెస్టుకు అనేక ఆధారాలు ఉన్నాయంటున్న అధికార పార్టీ నేతలు, కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు కోర్టు విశ్వాసాన్ని కోల్పోయారా? ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో పోలీసు అధికారులు, విచారణ సంస్థ విఫలమైందా? బాబుకు బెయిల్ రావడంతో వైసిపి నేతల్లో అసహనం ఎందుకు పెరిగింది? తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సోమవారం…

Read More
bab

ఇక పొడిగించం…

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు కోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వ అదనపు ఏ.జీ. హాజరు కాలేకపోతున్నట్టు, మరింత సమయం కావాలని సీఐడీ ప్రత్యేక పీ.పీ. వివేకానంద కోర్టును కోరారు. అంతేకాక విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని వివేకానంద హైకోర్టును అభ్యర్ధించారు. పి. పి. అభ్యర్ధనను కోర్టు అంగీకరించక పోగా, మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది.తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా తెలిపింది.

Read More
remand

సాక్ష్యం చూపరు…బెయిల్ ఇవ్వరు…!

అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన…

Read More