కార్మికుల సమస్యల పై పోరాడడానికి జై స్వరాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘం ఏర్పాటైంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ (జె.ఎస్.టి.యు.) లోగో ఆవిష్కృతమైంది. అసంఘటిత కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిన జేఎస్టీయూసీ కార్మిక లోకాన్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ శాఖల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపధ్యంలో జేఎస్టీయూసీ బైక్ స్టిక్కర్లను తయారు చేయించి హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడతో వాటిని ఆవిష్కరణ చేయించారు.
కార్మిక నాయకులు. కార్మిక నాయకుల బైక్ లకు స్టిక్కర్లను అతికించిన అనంతరం కేఎస్ఆర్ గౌడ మాట్లాడుతూ కార్మిక హక్కుల పోరాటాలకు వేగుచుక్కగా జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ మారుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమ ప్రణాళిక రూపొందుతుందని జేఎస్టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో జేఎస్టీయూసీ శాఖలను నిర్మించామని, త్వరలోనే మిగతా కమిటీలను ఏర్పాటు చేస్తామని జేఎస్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎస్టీయూసీ మరో కార్యదర్శి గోలుకొండ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.