భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.”హర్ ఘర్ తిరంగా” వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగు తున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని.. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందన్నారు. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమని.. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్నారు. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని.. ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఈ 140కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు. ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.