kasi finl

అంతుపట్టని ఆక్రోశం …!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణపై పీకల లోతు కోపంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వ్యాపారం, సినిమాల కోసమే హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకున్న సంగతి మరచిపోయి తెలంగాణ ప్రాంత అధికార పార్టీ పైన, ప్రభుత్వం పైనా, ఇతర పార్టీల నేతల పైన ఆయన నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటి వరకు కెమెరాకు మాత్రమే పరిమితం అయి, సినిమా వేషాలు చూపించిన పవన్ ఆంధ్రలో చంద్రబాబు పంచన చేరి బిజెపి సిఫారసు మేరకు అక్కడ మంత్రి…

Read Full News
cover

అహం..పతనం.. అదే “సనాతనం”..!

అమ్ము కోవడం కోసం పార్టీలు పెట్టడం,పదవుల కోసం సిద్ధాంతాలు, లక్ష్యాలను తుంగలో  తొక్కడం  ఒకప్పటి ప్రజారాజ్యం, నేటి  జనసేన పార్టీలకే సొంతం. రంగు పూసుకున్న మొహాలు చూసే ప్రేక్షకులు తమను నాయకులుగా ఎన్నుకుంటారనే అత్యాశతో  రాజకీయ పార్టీలు పెట్టడం పారిపోయింది. తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. అంతేకాదు, ఆ నాయకుల నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల కూడా వాళ్లను వెండితెర నుంచి జనంలోకి నడిపించాయి. పార్టీ సిద్ధాంతాలను వాళ్ళు ఎన్నడూ విస్మరించలేదు,…

Read Full News
babu 11c

ఉప ప్రధానిగా చంద్రబాబు?

కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశ రాజకీయాలోనూ పెను మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు పిల్లర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితీష్ కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ బుక్ చేసుకున్నారు. ఇక మిగిలింది చంద్రబాబు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను కుమారుడు లోకేష్ కు అప్పజెప్పి, చంద్రబాబు ఏకంగా దేశ ఉప ప్రధాని పదవి పై కన్నేసినట్టు రాజకీయ చర్చలు గుప్పుమంటున్నాయి. తెర…

Read Full News
modi

ఇళ్లకు కేంద్రం పరిహారం

జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ – పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పాకిస్థాన్ సైన్యం దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందజేయనున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ 25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సరిహద్దులో దెబ్బ తిన్న 2060 ఇళ్లకు ఈ పరిహారం ఇవ్వనున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు లక్షరూపాయల చొప్పున బాధితులకు అందజేస్తారు.

Read Full News
lovebirds c

“గులాబీ” పై “కాషాయం”మోజు..!

అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం…

Read Full News
IMG 20250507 WA0010

“ఉగ్ర” గడపకు “సింధూర్”

పాకిస్థాన్ ఉగ్ర అడ్డాల పై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులు వ్యూహాత్మకంగా జరిగాయి. ఆపరేషన్ “సిందూర్” ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్ ఉగ్రవాద…

Read Full News
Tar c

పాలన అంటే “ప్రతీకారం”..!

ప్రజాస్వామ్యంలో రాజకీయం వేరు. పగ, కక్షలు, కార్పణ్యాలు వేరు. రాజకీయాలు అనేక లక్ష్యాలతో నాయకులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాయి. కక్షలు వ్యక్తిగత వ్యవహారాలతో ముడిపడి పగతో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఏ రాజకీయం చేయాలనుకున్నా అవి రాజ్యాంగానికి కట్టుబడి తీరాలి. అదే కక్ష సాధింపునకు తెగించాలనుకుంటే నీతి, నియమాలతో గానీ, ఏ చట్టంతో గానీ పని లేదు. మూర్ఖపు ఆలోచనలతో వ్యూహాలు వేస్తే చాలు. నువ్వా…నేనా…అంటూ రోషాలు పెంచుకుంటూ బలం చూపుకుంటే అదే హీరోయిజం….

Read Full News
IMG 20250214 WA0030

చైనాతో ఇలా చేద్దాం…

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు….

Read Full News
muslam c

“ముసలం” మొదలైందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ముసలం మొదలయిందా? ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య విభేదాల బీజం నాటుకుంటోందా? నేతల మధ్య బయటకు పొక్కని కుమ్ములాటలకు తెర లేచిందా? దక్షిణాదిలో ఆధిపత్యం కోసం ఆంధ్రా నేతలే పావులుగా బిజెపి చదరంగం సిద్ధం చేసిందా? జనసేన అధినేత వ్యవహార శైలిలో ఎందుకు మార్పు వచ్చింది? కీలకమైన మంత్రిత్వ శాఖను చేతిలో పెట్టుకున్న ఆయన రెండు మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రి పలకరించే ప్రయత్నం…

Read Full News
pawan pan c

కదులుతున్న బిజెపి “పావు”..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…

Read Full News
CHIRU C

“అందరివాడు” క్లైమాక్స్ ఏమిటి..!

నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు…

Read Full News
adani c

మోడీ పెంచిన “మనీ”కొండ..!

నరేంద్రమోడీ, నీరబ్ మోడీ, అదానీ… దేశంలో 2014 వరకు ఈ మూడు పేర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే జనానికి తెలుసు. ఎన్.డి.ఎ. అధికారం చేపట్టక ముందు వరకు వ్యాపార రంగంలో అదానీ ఒక అడ్రస్ లేని వ్యక్తి. నీరబ్ మోడీ జాడ కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి అనామకులు రాజకీయాల అండదండలతో దేశ ప్రజలు చూస్తుండగానే అనతి కాలంలోనే అపర కుబేరులుగా మారారు. వీళ్ళ అక్రమ మార్గాల ధాటికి దశాబ్దాలుగా వివిధ వ్యాపారాల్లో…

Read Full News
IMG 20240822 WA0001

పోలాండ్ లో ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం. భారత్, పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.కాగా, మోదీ పోలాండ్ పర్యటనకు రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు….

Read Full News
IMG 20240815 WA0035

ప్రపంచానికే స్ఫూర్తి…

భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.”హర్‌ ఘర్‌ తిరంగా” వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగు తున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని.. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందన్నారు. భారత్‌ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమని.. శతాబ్దాల…

Read Full News