వచ్చే ఎన్నికల్లో వారే కీలకం….

brs usa

తెలంగాణ  అభివృద్ధి కేసీఆర్  దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్  అన్నారు.  బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు జరిగింది, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.  ఐటీ రంగంలో రెండు లక్షల యాభై వేల కోట్ల ఎగుమతులు కేటీర్ సమర్థ నాయకత్వం వలన సాధ్యపడిందని, టి – హబ్ ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యూబేటర్ అని, టి – వర్క్స్ ఆవిష్కర్తలకు, చిన్న, మధ్య తరహా సంస్థలకు దేశంలో అతిపెద్ద ,  ప్రాథమిక రూప కల్పన కేంద్రం అన్నారు. డేటా సెంటర్ పాలసీ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, టి.ఎస్ ఐపాస్ ద్వార పదిహేను రోజుల్లో కంపెనీలు స్వీయ ధ్రువీకరణ చేసుకోగలగడం గొప్ప పరిణామం అన్నారు. తెలంగాణలో  రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్- యూఎస్ ఏ కార్యకర్తల పాత్ర చాలా  కీలకమైనదిగా మహేష్  పేర్కొన్నారు. ప్రముఖ అటోర్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షులు అరిందమ్ గుహ, బ్లూ ఆష్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్ ప్రమోద్ ఝవేరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *