ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మరో నిలువుటద్దం ఈ ఫ్లై ఓవర్. బైరముల్సా గూడ వైపు వెళ్గడానికి సాగర్ రోడ్ పై నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్ప కూలి 10 మందికి గాయాలయ్యాయి . ఉత్తర ప్రదేశ్, బీహార్ కి చెందన సుమారు 12 మంది కార్మికులు పనుల్లో ఉన్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్పకూలినట్టు, దీనికి ఇంజనీర్ల నిర్లక్ష్యమా లేక కాంట్రాక్టర్ల వైఫల్యమా అనే వివరాల పై విచారణ జరుగుతోందని ఎం.ఎల్.ఏ. సుదీర్ రెడ్డి తెలిపారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు అయన తెలిపారు.
