
Balakrishna


కాలుకి గాయం..
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు సినిమా షూటింగులో గాయపడింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ భామ ఊర్వశి గాయపడింది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకోగా ఈ షూటింగ్ లో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె ఆరోగ్యం స్థిమితంగా ఉందని వైద్యులు చెప్పారు.

అమరావతిలో ఆసుపత్రి..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ తెలిపారు. అనేక మంది పేద , మధ్య తరగతికి చెందిన క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న హైదరాబాద్ లోని నందమూరి బాసవతరక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మాదిరిగానే అదే పేరుతో ప్రజల సౌకర్యార్ధం అమరవతిలోనూ నెలకపలపనున్నట్టు వివరించారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ఈ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనే స్థలం కేటాయించారని చెప్పారు. కొద్ది…

వార్షికోత్సవంలో…
హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హిందూపురం ఎంఎల్ఏ బాలకృష్ణ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆస్పత్రి బోర్డ్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వర రావు రేవంత్ కి స్వాగతం పలికారు.

రేవంత్ – బాలయ్య..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నటులు నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ నివాసానికి వెళ్ళి పుష్పగుచ్చం అందజేశారు.

శ్రీలీలా …
“భగవంత్ కేసరి” సినిమా విడుదల ముందస్తు వేడుకలు మొదలవడంతో ఆ సినిమాలో నటిస్తున్న గ్లామర్ నటి శ్రీలీలా పై యువత దృష్హి సారించింది. రవితేజ సరసన అనందం పంచిన ఆమె బాలయ్యతో ఎలా చిందులు వేస్తుందా అని కుర్రకారు తెగ వేచి చూస్తోంది.

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

ఖబడ్దార్…దమ్ముంటే రా…
ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి రోజు సమావేశాలు రసాభాసగా మారాయి. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ సభ్యులు సైతం పోడియం వద్దకు చేరడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎం.ఎల్.ఎ. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశం సభ్యులతో జతగట్టడం విశేషం. ఇదే సందర్భంల్లో ఎం.ఎల్.ఎ. నందమూరి బాలకృష్ణ మీసం మేలవేయడం చర్చనీయాంశంగా…

“కేసరి” తీన్మార్…
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “భగవంత్ కేసరి” ఈ నెల 19న వెండితెర పై గర్జించదానికి సన్నద్ధం అవుతోంది. ఈ సినిమాలో నటి శ్రీలీలతో కలిసి బాలయ్య తీన్మార్ చేశారు.