ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి రోజు సమావేశాలు రసాభాసగా మారాయి. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ సభ్యులు సైతం పోడియం వద్దకు చేరడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎం.ఎల్.ఎ. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశం సభ్యులతో జతగట్టడం విశేషం.

ఇదే సందర్భంల్లో ఎం.ఎల్.ఎ. నందమూరి బాలకృష్ణ మీసం మేలవేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి అంబటి రాంబాబు స్పందిస్తూ “దమ్ముంటే రా… చూసుకుందాం” ఆని వ్యాఖ్యానించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, చినరాజప్ప, వెంకటరెడ్డినాయుడు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, శ్రీదేవి, అశోక్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు.