IMG 20240805 WA0023

చరిత్ర తిరగ రాస్తాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగ రాయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ ల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం అధికారుల్లో నైతికత దెబ్బతిన్నదని అన్నారు. ఇక్కడి…

Read More
IMG 20240802 WA0010

ఫలితాలు చూపాలి…

ప‌థ‌కాలు అందించ‌డ‌మే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫ‌లితాలు సాధించే విధంగా ప్రణాళికతో ప‌ని చేయాల‌ని ఆంద్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. స‌చివాల‌యంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై సీఎం సమీక్ష చేశారు. అంగ‌న్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌పై అధికారుల‌తో సీఎం స‌మీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం,…

Read More
IMG 20240726 WA0025

రచ్చ చేస్తే “రద్దు” చేస్తాం..

శాసనసభలో కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేక పోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. ‘‘గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. గతంలో నన్ను ఏ రోజూ అసెంబ్లీలో కూర్చో నివ్వలేదు. ప్రస్తుతం నా దగ్గరకు 10 మంది భారాస ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు….

Read More
IMG 20240729 WA0010

Son of “Nallamala”

Telangana Chief Minister Revanth Reddy addressed a public meeting in Kalwakurthi, he Highlighted that I am son of Nallamala and Brother of all of you. Senior Congress leader S.Jaipal Reddy continued in public life till his last breath whether he is in power or in opposition. Jaipal Reddy strictly believed in his principles and pursued…

Read More
babu mark c

ఎవరి “మార్కు” పాలన..!

ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కొత్త ప్రభుత్వ పాలన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు  పరిపాలన ఆలోచనలు, రూపొందించే వ్యూహాలు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తాయనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. నెల రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న ఆరాటం ప్రతీ ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అమరావతి అభివృద్ది, విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారం, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, రైతు సమస్యల పై…

Read More
IMG 20240706 WA0053 1

తొలి అడుగు..కమిటీలు…

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో…

Read More
IMG 20240703 WA0052

“భేటీ” కోసం..

ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లును తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు….

Read More
IMG 20240530 WA0034

ఇక “జయ జయహే”..

’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు…

Read More
rvnth tpt

తెలంగాణా మండపం…

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మనవడి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో…

Read More
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read More
IMG 20240406 WA0010

రేవంత్ “ఆట”విడుపు..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆటలో తెలంగాణ ముఖ్యమంత్రి సందడి చేశారు. విక్టరీ వెంకటేష్ ముఖ్యమంత్రికి జతగా ఉన్నారు. మ్యాచ్ లో గెలుపొందిన సన్ రైజర్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ లకు రేవంత్ మోమెంటోలు అందజేశారు.

Read More
kejri jail

వర్క్ ఫ్రమ్ “జైల్”…

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జల వనరుల శాఖకు జారీ చేశారు.ఈ రోజు సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి అరవింద్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే…

Read More
IMG 20240228 WA0007

“ఆరు”అమలు ఖాయం…

ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…

Read More
IMG 20240217 WA0009

“కట్” చేస్తే..సస్పెండ్..

విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా…

Read More