
తారలు దిగివచ్చిన వేళ …
“ప్రపంచ సుందరి” కిరీట పోటీల ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నెల పదో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 115 దేశాలకు చెందిన మిస్ వరల్డ్…