మిస్ వరల్డ్ “చెక్”…

IMG 20240310 WA0011

ఈ సారి ప్రపంచ సుందరి-2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి కైవసం చేసుకుంది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా ఈ కిరీటాన్ని అందుకున్నారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన  వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు.

IMG 20240310 WA0010
క్రిస్టినా సినీశెట్టి

ఇక ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన మన దేశానికి ఈసారి నిరాశే ఎదురైంది. భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి టాప్-8కు పరిమితమయ్యారు. ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చినా, అజైటౌన్ (లెబనాన్) టాప్-4కు ఎంపిక కావడంతో సినీ శెట్టి అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ ఉమెన్ జూలియా మోర్లీ ఈ అవార్డును ప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *