హైదరాబాద్ లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న మిథాలీ అగర్వాల్ త్వరలో జరగనున్న జాతీయ స్థాయి మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా తెలంగాణ – 2025 పోటీలో అండర్ 40 కేటగిరీలో మిథాలీ మూడో రన్నర్-అప్‌గా నిలిచారు.

మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీలలో 32 మంది పోటీ పడ్డారు.మిథాలీ తన కెరీర్‌లో గతంలో ఐఐటీ, హైదరాబాద్ క్యాంపస్ కి పౌర సంబంధాల విభాగంలో, హైదరాబాద్ యూనివర్శిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా, సిగ్నోడ్ ఇండియాలో బిజినెస్ లో మేనేజర్ గా పనిచేశారు. కమ్యూనికేషన్ రంగానికి ఆమె చేసిన కృషిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తించి, 40 అండర్ 40 అవార్డు, 2024లో డైనమిక్ ఉమన్ లీడర్ షిప్ అవార్డు వంటి గౌరవాలను పొందారు. ఆమె సాధనలలో రెండు చాణక్య అవార్డులు దక్కించుకున్నారు.