ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏటా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావు స్థానం పొందారు. 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. ఆయన ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక యూనివర్సిటీ లో ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి, సెంటర్ ఫర్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ విభాగానికి డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మద్దిరాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రావు పాఠశాల విద్య స్వగ్రామంలో, డిగ్రీ వరకు ఖమ్మంలో, పీజీ నుంచి పీ.హెచ్.డీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలోఅభ్యసించారు. ‘తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రసార మాధ్యమాల పాత్ర’ అనే అంశం పై పీహెచ్ డీ చేశారు. ఎడ్యుకేషన్, ఫిలాసఫీ వంటి సబ్జెక్టుల్లో దాదాపు పాతిక సంవత్సరాల బోధన అనుభవం ఆయన సొంతం. 1995 నుంచి కొంత కాలం పాటు ఆయన ఒక ప్రముఖ దిన పత్రికలో ఒక విభాగానికి కీలక పాత్ర పోషించారు.