
wins


పోరాడి ఓడిన “కివీస్”
వరల్డ్ కప్ క్రికెట్ మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసి, 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54) ఫర్వాలేదనిపించారు.
మరో విజయం…
ప్రపంచ కప్పు క్రికెట్ లో వరుస విజయాలతో భారత్ దూసుకు పోతోంది. ధర్మశాలలో జరిగిన ఆటలో న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 274 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 95 పరుగులతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అటు రోహిత్ 46, జడేజా 39*, శ్రేయస్ 33, రాహుల్ 27 రన్స్…

“పాక్” ఓటమి…
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ తడబడింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా (64), ఇమాముల్(70), రిజ్వాన్(46) మాత్రమే రాణించారు. పాక్ 45.3 ఓవర్లలో 305 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది.దీంతో ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం దక్కింది. మరోవైపు పాకిస్తాన్ వరుసగా 2వ ఓటమి చవిచూసింది.

అదిరే బోణీ…
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 199 పరుగులకు ఆలౌటైంది. జడేజా 3, కుల్‌దీప్ 2, బుమ్రా 2, అశ్విన్, సిరాజ్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత 200 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు వరుస షాక్‌లు తగిలాయి. ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్…