వరల్డ్ కప్ క్రికెట్ మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసి, 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54) ఫర్వాలేదనిపించారు.