వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 199 పరుగులకు ఆలౌటైంది. జడేజా 3, కుల్‌దీప్ 2, బుమ్రా 2, అశ్విన్, సిరాజ్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత 200 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు వరుస షాక్‌లు తగిలాయి. ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్ (0) డకౌటయ్యారు. అయినప్పటికీ ఏ మాత్రం తడబడకుండా నిలబడి విరాట్ (85), కేఎల్ రాహుల్ (97) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సెంచరీకి చేరువలో విరాట్ ఔటైనా హార్దిక్ తో కలిసి రాహుల్ మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రపంచకప్‌లో బోణీ కొట్టారు.
అదిరే బోణీ…
