సినిమా చూపిన ముఠా ... - EAGLE NEWS

సినిమా చూపిన ముఠా …

notes

మార్కెట్ లో రోజుకో రూపంలో మోసగాళ్ళు తిరుగుతున్నా అత్యాశపడే వారికి మాత్రం వాళ్ళు కనిపించడంలేదు. “ఒకటికి రెండు” అనే బురుడీ మాటలు చెబుతున్నవారి వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో నిలువునా మోసపోతున్నారు. నంద్యాలలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకటికి మూడింతలు అంటూ కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఈ వివరాల్లోకి వెళ్తే అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని స్థానిక స్థిరాస్తి వ్యాపారి మదన్ మోహన్ రెడ్డి ని ఓ ముఠా నమ్మించింది. తాము ఇదే దండ చేస్తుంటామని, ఎలాంటి మోసం ఉండదని బురుడీ మాటలు చెప్పింది. దీంతో ఆశకు పోయిన మోహన్ రెడ్డి ఒక ఆ మంచి ముహూర్తం చూసుకొని 2.50 కోట్ల రూపాయలు నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకు అప్పజెప్పాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ జరిగింది. ఒరిజినల్ నోట్ల స్థానంలో వెళ్ళు నకిలీ నోట్లు ఇవ్వలేదు. బహుశా ఆ ముఠా దగ్గర నకిలీ నోట్లు కూడా లేవనుకుంటా అందుకే దానికో పకడ్బందీగా ప్లాన్ చేశారు. సినిమా డైరెక్షన్ మాదిరిగా స్కెచ్ రూపొందించారు. అదేంటంటే, మోహన్ రెడ్డి నగదు ఇచ్చే సమయంలో పోలీస్ సైరన్ మోగించుకుంటూ జీప్ వస్తుంది. ఆ భయానికి ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతారు. అదే జరిగింది. మోహన్ రెడ్డి నగదు ఇస్తున్న సమయంలో ఒక జీపు సైరన్ మోగించుకుంటూ రావడంతో అప్పటికే డబ్బు దక్కించుకున్న ముఠా భయపడ్డట్టు నటించి మోహన్ రెడ్డిని వదిలేసి అక్కడినుంచిగా ఉదయించింది. దీంతో దిమ్మతిరిగిపోయిన రెడ్డి చేసేది లేక తను మోసపోయననే విషయాన్ని పోలీసులకు చెప్పి కేసు పెట్టాడు. మూడు ప్రత్యెక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *