ఆ గళం మూగబోయింది. కాలి గజ్జెల సవ్వడి మాయమైంది. ఎర్ర గుడ్డతో ఎగిరే విప్లవ కర్ర ఒరిగి పోయింది. దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన ప్రజా గాయకులు గద్దర్ ఇక లేరు. అపోలో ఆస్పత్రిలో చికత్స పొందుతూ అయన కన్నమూశారు. ఉపిరి తిత్తులు, ముత్ర కోశ సమస్యలతో గద్దర్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 77 ఏళ్ల ఈ ప్రజా మనిషి దాదాపు నాలుగు దశాబ్దాలుగా “గద్దర్” పేరుతో తెలుగు జన హృదయాల్లో నిలిచి పోయారు. ప్రజా సమస్యలపై పాటలతో పోరాడే ఈ వీరుని అసలు పేరు గుమ్మడి విఠల్. వెన్నులో పాతికేళ్ళుగా బులెట్ ఉన్నా లెక్క చేయని సాంస్కృతిక ఉద్యమం యోధుడు కనుమరుగావడం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చింది.

పాటనై వస్తా…
