శుభకార్యానికి వెళ్తూ.. - EAGLE NEWS

శుభకార్యానికి వెళ్తూ..

ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా కాకినాడలో జరిగే ఓ శుభకార్యంలో పాల్గొనడానికి పొదిలి నుండి వెళ్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చనిపోయిన ఏడుగురు వ్యక్తులు మినహా మిగిలిన 30 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని దర్శి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రయాణం జరిగిన అరగంట సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీను తప్పించపోయి సాగర్ కాలువలో బస్సు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలిపారు. బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *