చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చింది. నిన్న 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించుకున్న చంద్రయాన్-3 ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్ (ఎల్ వి ఎం 3)ఎం4 వాహక నౌక నింగిలోకి దూసుకుపోయింది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. చందమామ పైకి ల్యాండర్‌ను జారవిడిచే చంద్రయాన్ -1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చంద్రుడిపై రోవర్‌ను దింపే క్రమంలో సమస్యలు తలెత్తడంతో సాక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. ఆ వైఫల్యాలను సవరించుకొని తాజాగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపటింది. వచ్చే నెల 23 లేదా 24న తేదిల్లో చంద్రుడిపై ల్యాండర్ దిగుతుందని ఆశిస్తున్నారు.