పోరాటం ఆగదు…

dharna 1

జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్  సహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *