రండి..కదలండి..

jnj17
jnj 17 in

దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్  సహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వమూ, అధికారులు నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *