వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి. రాణి కమలా పాటి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ వద్ద సీ-14 కోచ్ నుంచి మంటలు వ్యాపించాయి. వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకో పైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పి వేశారు. అదృష్టవ శాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగలేదు.