హైదరాబాద్ లో ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి పేదలకు ఇళ్ళ పంపిణి చేయకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ అధికారులను ఆదేశించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల కోసం నిర్మించిన రెండు గదుల ఇండ్ల పంపిణికి ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆగస్టు మొదటి వారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని కేటిఅర్ సూచించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు ఆరు దశల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ షెడ్యూల్ విడుదల చేసింది.
