అప్రమత్తం…

cs shanti

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ,  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో వర్షాలు తగ్గి అక్కడ నుండి వరద ప్రవాహం   తగ్గుతున్నందున, భద్రాచలం వద్ద కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని అన్నారు. అయినప్పటికీ,  ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అన్ని జిల్లాల్లో సరిపడా మందులు, విధ్యుత్ పరికరాలు సిద్ధంగా ఉంచామని అన్నారు. భద్రాద్రి,  కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పనిచేసిన మాజీ కలెక్టర్లకు అనుదీప్, కృష్ణ ఆదిత్యలను తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని సి.ఎస్ ఆదేశించారు ఎట్టిపరిస్థితుల్లో ప్రాణ , ఆస్తి నష్టం  కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలనుండి బాధితులను తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని శాంతి కుమారి ఆదేశించారు.  డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విజయవాడ నుండి రెండు ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు రానున్నాయని అన్నారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు ఆరు గ్రామాలూ ప్రభావితం ఆ అయ్యాయని, ఈ గ్రామాలలో పోలీస్ బృందాలు, సంబంధిత శాఖల సహాయంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. ఐజి చంద్ర శేఖర్ రెడ్డిని భద్రార్డీ కొత్తగూడెం జిల్లాకు వెంటనే వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించినట్టు వెల్లడించారు.  నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ, మేడిగడ్డ నుండి 5 .28 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజ్ నుండి 8 .41 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల అవుతున్నాయని, ఈ ఫ్లో లు తగ్గే అవకాశముందని అన్నారు. వరంగల్ , ములుగు జిల్లలోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయని, ఇప్పటివరకు ఏవిధమైన సమస్యలు తలెత్తలేదని విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *