ఎక్కడి సమాచారమో ఏమో గానీ ఆ ప్రాంతం తిరునాళ్ళ మాదిరిగా తయారైంది. రంగురాళ్ళు కాదు, కోరండం రాళ్ళూ కాదు ఏకంగా వజ్రాలే. వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులు వ్యాపించడంతో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలోని బసవమ్మ వాగు జనసంచారంతో కోలాహలంగా మారింది. సత్తెనపల్లి సమీపంలోని బసవమ్మ వాగు వద్ద వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో పలు ప్రాంతాల నుండి జనం కుటుంబ సమేతంగా వచ్చి వజ్రాలను వెతకడం మొదలుపెట్టారు. కొందరు పిల్లలను పాఠశాలలు మాన్పించి మరీ వజ్రాలు వెతికేందుకు తీసుకొచ్చారు. ఇంకొందరైతే కొందరైతే ఏకంగా చట్టి బిడ్డలను చంకనేసుకుని వచ్చారు. వీరంతా ఉదయం నుండి సాయంత్రం వరకూ వజ్రాల వేటలో నిమగమవుతున్నారు. వినుకొండ, చిలకలూరిపేట, పెదకూరపాడు, పిడుగురాళ్ల, మాచర్ల తదితర ప్రాంతల నుండి తండోపతండాలుగా వస్తున్నారు. సత్తెనపల్లి ప్రాంతంలో ఎక్కడ ఎర్రమట్టి కనపడినా అక్కడ వజ్రాల కోసం వెదుకుతున్నారు. కొడవళ్లు, ఇనుప రాడ్డులతో తవ్వుతూ ప్రతీ అంగుళం గాలిస్తున్నారు. ఐతే ఇటు రెవిన్యూ, అటు గనుల శాఖ అధికరులకు ఈ వ్యవహారం తెలిసి కూడా పట్టించ్చుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు జ్యోక్యం చేసుకుంటే అసలు విషయం బయటపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.