మణిపూర్ లో శాంతి భద్రతలు క్షీణించాయనే సాకుతో అక్కడ మే 4 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 355 ను అమలులోకి తెచ్చిందని, అంటే అప్పటి నుంచి మణిపూర్ లో రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణ అధికారం కేంద్రం చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఆ రోజు నుండి మణిపూర్ లో జరిగిన ప్రతి హింసాకాండకూ, ప్రతి నేరానికీ ప్రత్యక్ష బాధ్యత కేంద్ర హోమ్ శాఖా మంత్రి , దేశ ప్రధానమంత్రిదే అని రాజీవ్ గాంధీ పంచాయతి రాజ్ సంఘటన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కిరణ్ ముగబసు అన్నారు. మణిపూర్ లో శాంతి భద్రతలు పరిరక్షించాలని, అక్కడ జరుగుతున్నా అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన కోవోత్తుల నిరసన ప్రదర్శనలో అయన పాల్గొన్నారు. కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి దేశానికే తలవంపులు తెచ్చిన ఈ అనాగరిక ఘటన కు నైతిక బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్న్బించారు.