ఎన్నికలు సమీపించే సమయంలో సీనియర్ లీడర్ వనమా వెంకటేశ్వరరావు కి గట్టి డెబ్భ తగిలింది. గత ఎన్నికల్లో అయన గెలుపు చెల్లకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదంటూ తీర్పు హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల సమయంలో తప్పుడు ధృవపత్రాలతో అఫీడవిట్ సమర్ఫించారని వనమా పై ఆ ఎన్నికల్లో ప్రత్యర్ధి , మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోర్టులో అనర్హత పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ అభియోగాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎట్టకేలకు వనమా ను ఎమ్మెల్యేకు అనర్హుడని తేల్చింది. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. వనమాకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న అభ్యర్ధి ఎమ్మెల్యేగా అర్హుడని పేర్కొంది. దీంతో జలగం వెంకట్ రావు అర్హత సాధించే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పటి టిఅర్ఎస్ నుంచి జలగం వెంకట్రావును బరిలో దిగారు. 4,139 ఓట్ల తేడాతో వెంకట్రావుపై వనమా విజయం సాధించారు. ఆ తరువాత టిఅర్ఎస్ గూటికి చేరిపోయారు. అయితే , వనమా ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వనమా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు వెంకట్రావు వాదనలతో ఏకీభవించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే కాదని తేల్చి చెప్పింది. కొత్తగూడెం ప్రజలకు మాత్రం టిఅర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా, మరో టిఅర్ఎస్ ఎమ్మెల్యే వచ్చినట్టయింది.