ఎవరేంటో తేలాలి…

jnj 3 2

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ విలేకర్లు డబ్బు చెల్లించి మరీ ఎదురుచూస్తున్న ఇళ్ళ స్థలాలకు పరిష్కారం దొరుకుతుందా.. ఎంత పోరాటం చేసినా , దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం, అధికారులు ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు…దీని వెనుక ఎవరున్నారు ….అసలు జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఏం చేస్తోంది… అది ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతోందా… కమిటీ నాయకులలోనే కొందరు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారా, ఒత్తిడి తేలేక పోతున్నారా …జర్నలిస్టుల సదాక బాధకాలు చూడాల్సిన మీడియా అకాడమీ కూడా తన మనుగడను మాత్రమే చూసుకుంటుదా .. ఇవ్వన్నీ మూడు, నలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజధానిలో పని చేసిన, చేస్తున్న విలేకరులలో తలెత్తుతున్న ప్రశ్నలు. పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాకు పోరాటం గురించి చెబుతారా అనే “నెంబర్ టు మంత్రి” ఉన్న ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులకు ఎలా న్యాయం జరుగుతుంది. మా స్థలాలు మాకివండి అంటూ ప్రజా సంఘాల సమక్షంలో జర్నలిస్టు నేతలు ఎంత మొత్తుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎం.ఎల్.ఏ. క్రాంతి కిరణ్, గౌడ కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ వంటి వారు కమిటికి నాయకత్వం వహిస్తున్నా పాత జర్నలిస్తులకీ, కొత్త జర్నలిస్టులకు ఎందుకు న్యాయం జరగడంలేదు. తెలంగాణ పోరాటంలో ముందుడి పోరాడిన వారికి అడ్డు పడుతున్న వారు బయటివాళ్ళు కాదు…ఆ సీనియర్ల దగ్గర పనిచేసి వారి సలహాలు తీసుకున్న వారే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ వాస్తవాన్నే తొక్కి పెట్టడం మహా దారుణం.ఈ రోజు జరిగే జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కోసం సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కమిటీ లోపమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక ఒక ముఠా ఒత్తిడా అనే అనుమానాల పై ఆదివారం జరిగే కమిటీ సర్వసభ్య సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని హౌసింగ్ సొసైటికి ప్రభుత్వం ఎందుకు అప్పజేప్పడంలేదనేది ఆదివారం జరిగే సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేపట్టనున్నారు. నిజాంపేట, పేట్ బషీరా బాద్ మాదే అనే నినాదంతో జర్నలిస్టులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రభుత్వ పదవుల్లో ఉండి కమిటీకి నాయకత్వం వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందనే చర్చకూడా జరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *