కుండపోత వర్షాలతో వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. ఈ చెరువు గండిపడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న పోతననగర్, సరస్వతినగర్ కు ప్రమాదం పొంచి ఉంది. సమాచారం అందుకున్న మున్సిపల్, ఎన్.డి.ఆర్.ఎఫ్. అధికారులు హుటహుటిన గండి పడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. నివాస గృహాలవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నరు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా గండి ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.